సాధారణంగా సినిమాలలో అవకాశాల కోసం నిర్మాతలు హీరోయిన్స్,ఆర్టిస్ట్‌లను కమిట్మెంట్ అడుగుతుంటారు.కాని ఇక్కడ వ్యవహారం రివర్స్‌గా మారింది.సినిమా ప్రొడ్యూసర్‌నే రేప్ చేశాడు ఓ ఘనుడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది. హీరోయిన్ తను శ్రీ దత్తా నానా పటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది.అప్పటి నుంచి బాలీవుడ్ భామలు ఇండస్ట్రీలో తమకు జరిగిన లైంగిక వేధింపులు గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ వింటా నందా తనకు జరిగిన లైంగిక వేధింపులు గురించి తన ఫేస్‌బుక్‌లో చెప్పుకొచ్చింది.. రెండు దశాబ్దాలుగా తనలో తనే బాధపడుతున్న విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నా.. అంటూ ఫేస్‌బుక్ లో కొన్ని విషయాలను వెల్లడించారు.ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్ నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్ నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్లనాటి సంఘటనని వివరించింది.
