Thursday, May 9, 2024
- Advertisement -

రాజా సింగ్ ను రజనీకాంత్ ఇరికించాడా

- Advertisement -

టివి9 రజనీకాంత్ లైవ్ డిస్కషన్లు ఎలా ఉంటాయో గత దశాబ్దకాలం నుంచి చూసిన వారందరికీ భాగా తెలుసు. ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలా రజనీకి తెలిసినంత భాగా ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చనుకుంట. లేకపోతే రాజా సింగ్ పద్మావతి సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను బిటౌన్ సినిమా ఫ్యామిళీస్ నుంచి టాలీవుడ్ వరకు తీసుకువచ్చి నానా రచ్చచేశాడా. ఇక్కడ రజనీ అడిగేదానికి రాజా సింగ్ చెప్పే దానికి ఎక్కడ పొంతన కుదర్లేదు. రజనీ దృష్టిలో పెట్టుకోవల్సిన విషయం ఏమిటంటే… రాజా సింగ్ కు తెలుగు రాదని.అది తెలుసుకోకుండా రాజా సింగ్ లోని అగ్రెస్సివ్ నేచర్ ను మరింతగా రెచ్చిగొట్టి టంగ్ స్లిప్ అయిపోయేలా చేశాడు.

తమ్మారెడ్డి,దేవిలు ఈవిషయంపై ఫైర్ అయితే నాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించి తప్పంతా రాజా సింగ్ దే అని చెప్పడం దానికి అద్దంకి దయాకర్ వత్తాసు పలకడంతో రాజా సింగ్ కు తోటి బిజేపి లీడర్ల సపోర్ట్ తో ఫోన్ ఇన్ లోకి వచ్చి… విషయం అది కాదు ఇది అని చెప్పి రాజా సింగ్ ను ఇష్యూ నుంచి బయటకు తీసుకురావల్సి వచ్చింది. అప్పటికి కూడా రాజాసింగ్ నేను చెప్పింది వేరు మీరు చూపెడుతుంది వేరు అన్నట్లుగా వ్యవహరించడంతో ఇష్యూ మరో స్థాయికి వెళ్ళిపోయింది. చివరకు రాజా సింగ్ ఇక్కడ క్షమాపణలు చెప్పింది… ఎవరైనా నేను చెప్పింది తప్పుకుంటే సారి అన్నాడే తప్ప…నటీనటుల వ్యక్తిగత జీవితల గురించి అతను ఎక్కడా క్షమాపణలు ఒప్పుకున్నట్లుగా కనిపించలేదు. ఇంతదానికి రజనీకాంత్ ఏదో సాధించేసానని గగ్గోలు పెట్టడం ఎందుకు…చివరకు సరైన్ కన్ క్లూజన్ లేకుండా చర్చను ముగించడం దేనికి. ఇకనైనా రజనీకాంత్ అండ్ కో చర్చలు చేసే టైమ్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని సోషల్ మీడియాలో సర్వత్రా వినిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -