Saturday, May 11, 2024
- Advertisement -

ఏనుగుతో ఎక్స్ ట్రాలు చేస్తే ఇలాగే ఉంటాది

- Advertisement -

ఎవ్వరితో ఎక్స్ ట్రాలైనా చేయెచ్చు గాని చేయకూడని వాటితో అస్సలు చేయకూడదు. ఓ సెక్యూరిటీ గార్డ్ జనాలకు ప్రాణరక్షణ గురించి చెప్పాల్సి ఉండగా తానే ప్రాణాలను పోగొట్టుకున్న వైనం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనికి కారణం ఎందుకు పనికిరాని ఓ సెల్ఫీ కోసం అతను తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ్‌ బంగ్లాలో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన సాదిఖ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో లతాగురి అటవీ ప్రాంతం నుంచి వాహనంపై వెళుతుండగా అటుగా వెళ్తున్న ఓ ఏనుగు కంటపడింది.

ఏమనుకున్నాడో ఏమో అందరిలా మనం కూడా సరదాగా సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అది సాదిఖ్‌పై తొండంతో ఒక్కసారిగా దాడి చేసింది. అటుగా వెళుతున్న ప్రయాణికులు అతడిని రక్షించేందుకు ట్రై చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడు. ఏనుగు తొండంతో కొట్టిన దెబ్బకు బలంగా తాకడంతో అతను చనిపోయాడు.అన్నట్లు ఇంకో విషయం గతేడాది ఇదే ప్రాంతంలో ఏనుగుల దాడిలో 84 మంది చనిపోయినట్లు రికార్డుల బట్టి తెలుస్తుంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -