Friday, May 3, 2024
- Advertisement -

హీరోని అంకుల్ అని పిలిచిన హీరోయిన్‌

- Advertisement -

సాధార‌ణంగానే త‌మ క‌న్నా వ‌య‌స్సులో పెద్దవారిని అంకుల్ అనిగాని ,ఆంటీ అనిగాని పిలుస్తుంటారు . అయితే అంద‌రి విష‌యాల్లో ఇలా జ‌ర‌గ‌వ‌చ్చు ఏమోకాని , ఒక్క సినిమా వాళ్ల‌ను అంకుల్ అనిగాని ఆంటీ అనిగాని పిల‌వ‌కూడ‌దు. ఎందుకంటే అలా పిలిస్తే సినిమా వాళ్లు త‌ట్టుకోలేరు. అది హీరో అయిన హీరోయిన్ అయిన ఆంటీ అని పిలిపించుకోవాడినికి ఇష్ట‌ప‌డరు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌కు ఎదురైంది. బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుక్‌ను సారా అంకుల్ అంటూ సంబోదించింది. ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఎప్పటిలాగే హాజరయ్యి హంగామా చేసారు.

ఈ వేడుక గురించి ఒక రిపోర్టర్ సారా తో మాట్లాడుతూ షారూఖ్ అంకుల్ తో కలిసి మానాన్నహోస్ట్ చేయడం నాకు చాలా నచ్చే విషయం అంది. అంతే షారుక్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. సోష‌ల్ మీడియాలో సారాను తెగ ట్రోల్ చేస్తున్నారు షారుక్ అభిమానులు. మా హీరోని అంకుల్ అంటావా, మీ నాన్న వ‌య‌స్సు ఏంటో తెలుసుకో అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు షారుక్ ఫ్యాన్స్‌. ఈ విష‌యంలో సారాకు మ‌ద్ద‌తుగా చాలామంది నిలిచారు. ఫారుక్ వ‌య‌స్సు 53 , సారా వయసు 23 …వ‌య‌స్సులో ఇంత గ్యాప్ ఉన్న‌ప్పుడు ల‌వ‌ర్ పిలిచిన‌ట్లు పిలవాలా అంటూ ఆమెకు మ‌ద్దుతుగా పోస్ట్‌లు పెడుతున్నారు ఆమె అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -