Thursday, May 9, 2024
- Advertisement -

చంద్ర‌బాబు గాడిద‌లు కాస్తున్నారా….! వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ బాబుపై ఘాటుగా విమ‌ర్శ‌ల‌తో చెలిరేగిపోతున్నారు. అన్ని బ‌హిరంగ స‌భ‌ల్లోనూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ముందుకు సాగుతున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో బాబుపై నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. డ్వాక్రా రుణాలు అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. ఏమైంది? అక్షరాలు ఇవాళ రూ. 28వేల కోట్లరూపాయలకు ఎగబాకింద‌న్నారు. రైతుల రుణాల‌ను మాఫీ చేయ‌క‌పోవ‌డంతో అవి రూ. 87612 కోట్లు ఉంటే ఈ ఐదేళ్లలో వడ్డీలతో కలిపి రూ.1.5లక్షల కోట్లకు చేరాయని విమ‌ర్శించారు. ప్రతి జిల్లాకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు.

ఈ నియోజ‌క వ‌ర్గంలో వి.కోట, కొత్త వలస, రేపాల మండలాలలో తీవ్రమైన కరువు ఉందని….రేపాల మండలానికి ఆనుకోనే రైవాడ రిజర్వాయర్‌ ఉన్నాసాగునీరు, సాగు నీరు రాదు. ఇదే రైవాడ నుంచి నిళ్లు విశాఖకు తరలించుకుపోతున్నారు. అక్కడి పరిశ్రమలకు ఈ నీళ్లు పోతున్నాయి. ఇక్కడ సాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా…? అంటూ ప్ర‌శ్నించారు. విశాఖ‌న‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లో ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేద‌న్నారు. ఇదే జిల్లాలో జూట్‌ మిల్లులు మూతపడుతన్నాయి. జిల్లాలో ఉన్న ఫేరా పరిశ్రమలు చంద్రబాబు పెంచిన కరెంట్‌ రేట్లకు మూతపడుతున్నాయి. విభ‌జ‌న హామీ ప్ర‌కారం ఇక్క‌డ ఏర్పాటు కావాల్సిన గిరిజ‌న యూనిర్శిటీ ఏమైంద‌న్నారు.

2014 ఎన్నిక‌ల్లో 650 కి పైగా వాగ్ధాల‌ను ఇచ్చిన చంద్ర‌బాబు వాటిలో ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేద‌న్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి కాబ‌ట్టి…మళ్లీ మోసం చేసేందుకు రెఢీగా ఉన్నారు. చంద్రబాబు పుట్టింది ఇదే ఏప్రిల్‌ మాసంలో పుట్టారు. అంటే నాల్గొ నెల 20వ తారీఖు. అంటే ఫోర్‌ట్వంటీ(420). ఇది చంద్రబాబు వ్యక్తిత్వానికి సరిపోయేలా ఉంద‌ని వ్యాగ్యాస్త్రాలు సంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -