Wednesday, May 7, 2025
- Advertisement -

తమిళ సినిమా స్టార్ల ఇళ్లల్లో వంద కోట్ల అక్రమ ధనం దొరికిందా!

- Advertisement -

ఇటీవల తమిళ సినిమా తారల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో వాళ్ల ఇళ్లలో భారీగానే అక్రమ సొమ్ములు పట్టుబడ్డాయని వార్తలు వస్తున్నాయి.

కనీవినీ ఎరగని రీతిలో ఈ సారి ఏకంగా వంద కోట్లరూపాయల వరకూ అక్రమ ధనం దొరికిందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చెన్నైలోని ప్రముఖ తమిళ తారల ఇళ్లపై ఈ దాడులు జరిగాయి. తమిళ స్టార్ హీరో విజయ్, ప్రముఖ హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో వారి అక్రమాస్తులు భారీగానే పట్టుబడినట్టుగా తెలుస్తోంది.

విజయ్ అయితే ఆదాయపు పన్ను విషయంలో పదేళ్ల నుంచి అక్రమాలకు పడినట్టుగా తేలిందని వార్తలు వస్తున్నాయి. ఇక నయతార, సమంత ఆస్తుల విషయంలో కూడా లెక్కలు సరిగా లేవనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ అక్రమాస్తుల విలువ వంద కోట్లరూపాయల వరకూ ఉంటుందనే ప్రచారం అవాక్కయ్యేలా చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తిగా లెక్కలు తేలలేదని.. తేలాకా అసలు విషయం చెప్పగలమని ఐటీ అధికారులు చెబుతున్నారు.

మరి పైకి చాలా మంచి వాళ్లుగా.. సినిమాల్లో నీతులు చెప్పే సినీ తారులు, పేరున్న హీరోలు.. సందేశాలు ఇచ్చే నటులు ఈ స్థాయి అక్రమాల్లో పాల్పడటం విడ్డూరమే. మరి వీరిని అభిమానించే ప్రేక్షకులు ఇప్పుడు ఎలా స్పందిస్తారో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -