Thursday, May 9, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లోకి వ‌స్తాను.. నంద‌మూరి హీరో

- Advertisement -

నంద‌మూరి వంశంలో నుంచి వ‌చ్చిన న‌టుల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌నీస గుర్తింపు త‌ప్ప‌క ఉంటుంది. అందుకే ఆ కుటుంబం నుంచి ఎంతోమంది న‌టులు వ‌స్తున్నారు. వాళ్లంద‌రూ అడ‌ప‌ద‌డ‌పా సినిమాలు చేస్తున్నారు. వీరిలో ఇద్ద‌రు యువ న‌టులు మాత్రం సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వారే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఆయ‌న అన్న క‌ల్యాణ్‌రామ్‌. వీరిద్ద‌రూ సినీ ప‌రిశ్ర‌మ‌లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ కుటుంబంతో రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధం ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో అధికార పార్టీ టీడీపీ వీరి కుటుంబానిదే. మారిన రాజ‌కీయాల‌తో ఏం జ‌రిగిందో మీకు తెలుసు. అయినా ఈ కుటుంబంతో స‌త్సంబంధాలు కొన‌సాగించాల‌ని ప్ర‌స్తుం ఆ పార్టీ అధినేత ధోర‌ణి ఉంది. అయితే నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ అది ఎప్పుడో.. ఎందుకు వ‌స్తానో వివ‌రించారు.

ప్ర‌స్తుతం క‌ల్యాణ్‌రామ్ ఉపేంద్ర‌మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్మెల్యే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా క‌ల్యాణ్‌రామ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆడియో వేడుక‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌శ్నించారు. మీరు నిజంగా అంటే ఎమ్మెల్యే కావాలి అని కోరాడు. దీంతో క‌ల్యాణ్‌రామ్ రాజ‌కీయాల్లోకి రావాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇదే ప్ర‌శ్న అడ‌గ‌డంతో స‌మాధానం చెప్పారు. తాను రాజ‌కీయాల్లోకి త‌ప్ప‌క వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ ప్రేక్ష‌కులు ఇక నీ సినిమాలు చాలు అన్న‌ప్పుడు రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -