ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు సగటు ప్రేక్షకులలో పెద్దగా చర్చ జరుగుతున్న సినిమా ఏదైనా ఉందంటేట ఆది తప్పకుండా ఉప్పెన మూవీనే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర ఎంట్రీ ఇస్తుండం.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ అదరగొట్టెస్తున్నాయి. ఇక మెగా హీరోలతో పాటు పలువురు ఇది అద్బుతమైన స్టోరీ అంటూ కామెంట్లు చేయడం కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించిపెట్టింది.
కాగా, ఈ చిత్రంలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమవుతున్న మళయాల భామ కృతిశెట్టి తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో మొదటి సినిమా విడుదల కాక ముందే ఆమె వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ అగ్రదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్‌లో త్వరలో తెరకెక్కబోయే సినిమాలోనూ కృతిశెట్టికి హీరోయిన్‌గా ఛాన్స్ లభించినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఉప్పెన బ్యూటీ సెకండ్ హీరోయిన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ఇదే గనక నిజమైతే ఈ అమ్మడు అదృష్టం కలిసొచ్చినట్టే అని సినీ వర్గాలు గుసగులాడుకుంటున్నాయి. ఇక క్రేజీ కాంభినేషన్‌లో రాబోయే సినిమాలో తమిళ నటుడు శింబును విలన్‌గా చూపించనున్నారని సమాచారం. ఎన్టీర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే తివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా ఎన్టీఆర్ నటించనున్నారు. ప్రస్తుతం కుర్రకారు గుండెల్లో ఉప్పెన లేపుతున్న కృతిశెట్టి త్వరలోనే ఎన్టీఆర్ తోనూ వెండితెరపై రోమాన్స్ చేయనుందో లేదో చూడాలి..!
హిందీ పాటతో కుర్రకారుకు హీటెక్కిస్తానంటున్న రష్మిక
నువ్వా..? నేనా ? అంటూ పోటిపడుతున్న మహేష్ బాబు, ప్రభాస్