1962 నుంచి 1972 వరకు జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన స్టూడెంట్ మూవ్మెంట్స్ అన్నిటిలోనూ కీలకపాత్రధారి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒక బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సందీప్ కుమార్ ఈ సినిమాలో జార్జ్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది తాజాగా విడుదలైంది. సందీప్ కుమార్ ఈ పోస్టర్ లో అచ్చు జార్జిరెడ్డి లాగానే కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తేనే సందీప్ కుమార్ జార్జి రెడ్డి పాత్రలో ఒదిగిపోయి నటించారు అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సత్యదేవ్, శత్రు, నవీన్ బెతిగంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
