Thursday, May 9, 2024
- Advertisement -

నమ్ముకున్నోళ్లకే పదవులు.. మాజీ మంత్రికి జగన్ షాక్

- Advertisement -

వైసీపీలో ఆది నుంచి ఉన్నవారు.. పార్టీని నమ్ముకొని ఉన్నవారికే నామినేటెడ్ పదవులు ఇస్తూ వలసవచ్చిన నేతలను దూరంగా పెడుతున్నారు జగన్. ఈ వైఖరి ఇప్పుడు వైసీపీలో జగన్ పై ప్రశంసల జల్లు కురుస్తోందట.. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి ప్రతిపాదనను కూడా పక్కనపెట్టడం సంచలనంగా మారింది..

జగన్ గద్దెనెక్కాక తన సామాజికవర్గానికి చెందిన చాలా మంది సీనియర్లను పక్కనపెట్టారు. మంత్రి పదవులను ఇవ్వలేదు. దీంతో నొచ్చుకున్న వారిలో ఆనం రాంనారాయణ రెడ్డి ఒకరు. ఆయన మంత్రి పదవి దక్కకపోవడంతో చాలా రోజులు బయటకు కూడా రాలేదట.. అయితే తాజాగా ఆయనకు జగన్ మరో షాక్ ఇచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది.

ఆనం రాంనారాయణ రెడ్డి ప్రతిపాదించిన నెల్లూరు డీసీసీబీ అధ్యక్ష పదవికి ఆయన సన్నిహితుడికి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి ఇచ్చారట. ఇదే ఆనంకు మనస్థాపం కలిగించిందని టాక్. ఆనం తన అనుచరుడు, తనను ఆర్థికంగా ఆదుకున్న ధనుంజయరెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదించగా.. జగన్ మాత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన మేరకు ఆనం విజయకుమార్ రెడ్డికి కేటాయించారని నెల్లూరు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆనం విజయకుమార్ రెడ్డి పార్టీ కోసం ఆది నుంచి పనిచేశారట.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డాడట.. ధనుంజయరెడ్డి మాత్రం మాజీ మంత్రి ఆనంతో వలస వచ్చాడు. అందుకే ఆది నుంచి ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డికే జగన్ ఓటు వేయడం గమనార్హం. విశేషం ఏంటంటే ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్వయానా మాజీ మంత్రి రాంనారాయణ రెడ్డికి సోదరుడి వరుస. అయినా ఆయనను పక్కనపెట్టి అనుచరుడికి పదవి కోసం పట్టుబట్టిన వైనం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారుతోంది. జగన్ మాత్రం కష్టపడ్డ వ్యక్తికే పదవిని కేటాయించడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -