హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమా తర్వాత వరసు అవకాశాలను దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకోవడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇక బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌లోనూ మెప్పించారు.
ఇక తాజాగా చాలా కాలం తర్వాత నింద అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు వరుణ్. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం ఈ సినిమాని నిర్మించడమే కాదు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవాళ సినిమా టైటిల్‌ని రివీల్ చేయడమే కాదు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్ అమయాకంగా ఉంటే వెనుక ఓ ముసుగు వ్యక్తి రూపం ఉంది. అలాగే ఈ పోస్టర్‌ను రివర్స్ చేస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మే 15న టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.
