Friday, April 26, 2024
- Advertisement -

గూఢచారిగా వరుణ్ తేజ్

- Advertisement -

విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్‌3తో మంచి హిట్ అందుకుని జోరుమీదున్నాడు హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు ఇదే ఊపులో సరికొత్త సినిమాకు సిద్ధమైపోతున్నాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్.

ఈ మెగా హీరో కెరీర్‌లోనే భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది ఆ మూవీ. లండన్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. వరుణ్‌ ఓ ఇంటర్నేషనల్‌ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు.

గూఢచారిగా కనిపించేందుకు పూర్తిగా తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -