Thursday, May 9, 2024
- Advertisement -

బాల్యంలోనే వ‌రుణ్‌తేజ్‌కి ఓ ల‌వ్‌స్టోరీ

- Advertisement -

వ‌రుస విజ‌యాల‌తో ఉన్న వ‌రుణ్‌తేజ్ ఈసారి ప్రేక్ష‌కుల ముందుకు ‘తొలి ప్రేమ` సినిమాతో వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప‌లువురు మీడియాతో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జీవితంలో జ‌రిగిన తొలిప్రేమ గురించి పంచుకున్నాడు. రాశీఖ‌న్నా, వ‌రుణ్‌తేజ్ క‌లిసి న‌టించిన తొలిప్రేమ సినిమా శనివారం (ఫిబ్ర‌వ‌రి 10) థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వరుణ్ తొలిప్రేమ క‌థ‌ను మీరు తెలుసుకోండి.

త‌న‌కు తొలిప్రేమ బాల్యంలోనే ప‌ల‌కరించిందంట‌. త‌న స్కూల్ డేస్‌లోనే ఆ అనుభూతి ఎదురైందని సిగ్గు ప‌డ్డాడు. ‘‘భారతీయ విద్యాభవన్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో పరిచయమైంది. అమ్మాయిలతో మాట్లాడాలంటే వ‌రుణ్‌కు చాలా సిగ్గు. త‌ను పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ అమ్మాయే వ‌రుణ్‌తో చొరవ తీసుకొని మాట్లాడింది. తన ఫోన్ నంబర్ ఇచ్చింది. తరవాత కొన్నాళ్లు ఫోన్ల‌లో టచ్‌లో ఉన్న వారు ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌లుసుకోలేదు. ఇది ప్రేమలాంటిదే.. కానీ ప్రేమకాదు’’ అంటూ తన తొలిప్రేమను గుర్తుచేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -