Thursday, May 9, 2024
- Advertisement -

‘తొలిప్రేమ’ రివ్యూ

- Advertisement -

మెగా కాంపౌండ్‌నుంచి ఈ వారం రెండు సినిమాలు విడుల‌య్యాయి. మెగా అల్లుడితో పోటీ ఉంట‌ది అనుకుంటే పోటీలోనే లేన‌ట్టు అత‌డి సినిమా మారింది. సాయిధ‌ర‌మ్‌తేజ్ ‘ఇంటిలిజెంట్’ అట్ట‌ర్ ఫ్లాపు అని ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇక వ‌రుణ్‌తేజ్‌దే విజ‌యంగా భావిస్తున్నారు. ‘ఫిదా’ సినిమా త‌ర్వాత వ‌రుణ్ ‘తొలిప్రేమ’తో వ‌స్తుండ‌డంతో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ సినిమా శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 10)న విడుద‌లైంఇ. త‌న బాబాయి పవన్‌కల్యాణ్‌కు మంచి విజ‌యం అందించిన సినిమా పేరుతోనే వ‌రుణ్ వ‌చ్చాడు. మ‌రీ ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం..

క‌థ‌: ఆదిత్య (వరుణ్‌ తేజ్‌) ఒక రైలులో వర్ష (రాశీఖన్నా)ను చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమించి ఇంతందంగా ఉన్నావేంటి అని కౌగిలించుకుంటాడు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ అనుకోకుండా ఒకే కళాశాలలో చేరతారు. తనను ప్రేమించాలంటూ ఆదిత్య.. వర్ష వెంట పడుతూ ప్రేమ కోసం క‌ష్ట‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో ఆదిత్యపై వర్షకు ప్రేమ పుడుతుంది. వీరిద్ద‌రి మ‌న‌స్త‌త్వాలు వేర్వేరు. అయినా ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆదిత్యకి కోపం ఎక్కువ. గొడవపడిన‌ తర్వాత ఆలోచిస్తాడు. కానీ వర్ష ఆలోచించిన త‌ర్వాత‌ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే ప్రేమికులుగా మారిన వీరిద్దరి మధ్య బ్రేక‌ప్‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఆదిత్య-వర్ష విడిపోయి మళ్లీ ఆరేళ్ల తర్వాత లండన్‌లో కలుసుకుంటారు. లండ‌న్‌లో వీళ్లిద్దరు క‌లిశారా? మ‌ళ్లీ వీళ్లు ప్రేమికులుగా అయ్యారా? అనేది సినిమా చూడాలి.

తీసిన విధానం: ప‌్రేమించుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం క‌థ‌గా ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. మ‌ళ్లీ అదే క‌థ‌ను డిఫ‌రెంట్‌గా వెంకీ తీశాడు. ఒక్క ముక్క‌లో సినిమా చెప్పాలంటే ట్రైన్ ప్రయాణంలో మొదలైన వీరి ‘తొలిప్రేమ’ బ్రేకప్ కావడం తరువాత యూకేలో మళ్లీ కలుసుకోవడం. ఈ కథనాన్ని ఎక్క‌డా బోరు కొట్ట‌కుండా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా బ్యూటిఫుల్‌గా తెర‌కెక్కించాడు. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌ సాగిన కథలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఎమోషనల్ సీన్స్ గుండెల్ని తాకిస్తాయి. ఆది-వర్షల మధ్య రొమాంటిక్ సీన్స్, లవ్‌లో ఉండే మ‌ధుర జ్ఞాప‌కాలు, వీరిద్దరి మధ్య ఉండే లిప్‌లాక్ సీన్ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యాయి.

న‌టీన‌టులు: వ‌రుణ్ తొలిప్రేమ ప‌వ‌న్ తొలిప్రేమ చిత్రానికి ధీటుగానే మ‌రో బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్టే అని చెప్పుకోవ‌చ్చు. వరుణ్-రాశీఖన్నాలు పాత్ర‌ల్లో లీన‌మ‌య్యారు. ఈ మూవీలో వరుణ్-రాశీఖన్నాలు ఆది, వర్షలుగా కనిపించారు. రాశీఖన్నా వర్ష పాత్రలో మెరిసింది. ట్రైన్‌లో రాశీఖన్నాను చూసిన వరుణ్‌తేజ్‌.. వెంటనే రైలెక్కి ఆమెను వాటేసుకోవడం.. ‘ఇంత అందంగా ఉన్నావేంటి’ అని అడగ్గానే అవాక్కైన రాశీఖన్నా వరుణ్‌ చెంప ఛెళ్లుమనిపించడం కొత్త ఫీల్ కలిగిస్తోంది. ‘కలగా నా జీవితంలోకి వచ్చావ్‌…. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్‌.. మళ్లీ ఇలా మెరిశావ్‌‌…. కలో నిజమో అర్థం కావడంలేదు’ అంటూ తన ప్రేమభావాల్ని బాగా పలికించాడు వెంకీ అట్లూరి.

సినిమా మొత్తం కలర్‌ఫుల్‌గా.. ప్రేమ పులకరింతలతో యూత్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీతో పాటు తమన్ అందించిన నేపథ్య‌ సంగీతం చిత్రానికి ప్రేమజంటలను థియేటర్స్‌కి రప్పించేటట్లు చేస్తుంది. జ్ఞ‌ాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పటికీ మనతోటే ఉంటాయి.. మోయక తప్పదంటూ’ ప్రేమభారాన్ని మోస్తూనే తన తొలిప్రేమ ఎలా గెలుపించుకున్నాడో వెంకీ అట్లూరి తీశాడు.
ఈ సినిమా ప‌వ‌న్ మాదిరిగా వ‌రుణ్‌కు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవ‌కాశం మెండుగా ఉంది.

నటీనటులు: వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా, సపనా పబ్బి, ప్రియదర్శి, సుహాసిని, విద్యుల్లేఖ, హైపర్‌ ఆది తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: తమన్‌
నిర్మాత: బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌, దిల్‌రాజు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -