మెగా హీరోల్లో మెజారిటీ జనాలు కమర్శియల్ చిత్రాలే చూస్తుంటారు. అలా చూస్తేనే తమకు కలిసొస్తుందని ఫీలౌతుంటారు. ఎందుకంటే ముందు నుంచి వారి సక్సెస్ ఫుల్ కమర్శియల్ ట్రాక్ అలాగే ఉండమని చెబుతూ ఉంది. చిరు,పవన్, చరణ్ ,బన్నీ,సాయిధరమ్ తేజ్ లంతా ఆ విధంగా ప్రయత్నం చేసే సూపర్ సక్సెస్ అయ్యారు. కాని అదేంటో వరుణ్ తేజ్ మాత్రం దీనికి విరుద్దంగా వెళ్తున్నాడు. తాను కమర్శియల్ ప్రోడక్ట్ ను కాదనుకుని ఇలా వెళ్తున్నాడా లేక తానొక ఎక్స్ పరిమెంట్ మెటీరియల్ అని భావించి అటువైపుగా జర్నీ చేస్తున్నాడా చూడాల్సిన అవసరం ఉంది.
వరుణ్ చేసిన ముకుంద, కంచె, ఫిదాలు ఇతనిలోని మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ను పరిచయం చేశాయి. పూరి లోఫర్ , శ్రీనువైట్ల మిస్టర్ తాను కమర్శియల్ గా వర్కవుట్ కానని సంకేతాలు ఇవ్వడంతో ఇపుడు కూడా అబ్బాయిగారు ఘాజి చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇపుడు దానికి కథా చర్చలు అన్నీ ఓకే అయిపోతూ ఉండడంతో వరుణ్ డేట్స్ బట్టి తొలిప్రేమ తర్వాత వచ్చే ఏడాది మిడ్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లవచ్చని తెలిసిపోయింది.
ఈసినిమా కూడా తెలుగులోనే అని కాకుండా బాలీవుడ్లో కూడా ఘాజి కొచ్చినంత పేరు రావాలని మూవీ యూనిట్ భావిస్తుంది. అయితే ఇది ఏ తరహా కాన్సెప్ట్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందో మాత్రం చెప్పకుండా చూస్తున్నారు. హీరో నాని నిర్మాణంలో రెజీనా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కూడా ఇలాగే సైంటిఫిక్ ఫ్లేవర్ తో కనిపిస్తుంది. ఇదనే కాకుండా తెలుగులో సెట్స్ మీదున్న ఎన్నో సినిమాలు రాబోయే రోజులలో సైంటిఫిక్ టచ్ తో మన ముందుకు రాబోతున్నాయి. అందుకే ఆ వచ్చే సైంటిఫిక్ చిత్రాలకు విరుద్ధంగా వరుణ్ తేజ్ సినిమా ఉండాలి మరి.అపుడే కదా మనోడు తన కాంపౌండ్ కు అపోజిట్ డైరెకన్లో వెళ్తూ గొప్ప పని చేస్తున్నాడని పేరొచ్చేది.