Monday, May 6, 2024
- Advertisement -

లుంగీ క‌ట్టులో మెగా హీరో

- Advertisement -

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఎక్క‌డ అగ‌డం లేదు.వ‌రస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్ప‌టికే ఘాజీ ద‌ర్శ‌కుడు సంకల్ప్‌ రెడ్డితో మ‌రో ప్ర‌యోగానికి రెడీ అయిన సంగ‌తి తెలిసిందే.తాజాగా మ‌రో సినిమా షూటింగ్‌ను మొద‌లెట్టేశాడు వ‌రుణ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌2 మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో వెంకటేష్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు వ‌రుణ్ తేజ్‌.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాడు.

ఈ రోజు సెట్‌లో అడుగుపెడుతున్నట్లు వరుణ్‌ ట్వీటర్‌ ద్వారా అభిమానులకు తెలిపారు.ఈ సినిమాలో వ‌రున్ ప‌క్కా ప‌ల్లెటూరు అబ్బాయిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.వ‌రుణ్ ట్వీట్ చేసిన ఫోటోలో వ‌రున్ లుంగిలో ద‌ర్శ‌నం ఇచ్చాడు.ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సూప‌ర్ హిట్ కొట్టిన వ‌రుణ్ ఈ రెండు సినిమాల‌పై కూడా గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు.

 

https://www.youtube.com/watch?v=WSyger7d_NE

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -