Monday, May 6, 2024
- Advertisement -

‘పంతం’ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపిచంద్ గ‌తకొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక తీవ్ర ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.దీంతో గోపిచంద్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.ఈసారి ఎలాగైన హిట్ కొట్ట‌ల‌నే క‌సితో మ‌ళ్లీ త‌న‌కు క‌లిసి వ‌చ్చిన‌ క‌మ‌ర్షియ‌ల్ బాట ప‌ట్టాడు.గోపిచంద్ పంతం అనే సినిమాతో ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.ఈ సినిమాకు చ‌క్ర‌వ‌ర్తి అనే నుత‌న ద‌ర్శ‌కుడు ప‌నిచేశాడు.మ‌రి గోపిచంద్ పంతం నెగ్గిందో లేదో చూద్దాం.

కథ : విక్రాంత్ (గోపిచంద్) ఓ తెలివైన కుర్రాడు. ఓ గ్యాంగ్ ను వేసుకుని రాజకీయ నాయకుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా పొలిటికల్ లీడర్స్ అందరిని చుట్టేసిన విక్రాంత్ ఫైనల్ గా హోం మినిస్టర్ నాయక్ (సంపత్) ఇంట్లో కూడా చోరీ చేస్తారు. హోం మినిస్టర్ కాబట్టి పోలీసులు ఆ దొంగతనం ఎలా జరిగిందని కనిపెట్టే క్రమంలో విక్రాంత్ గ్యాంగ్ లోని కొందరిని పట్టుకుంటారు. ఇక వారి కోసం నాయక్ దగ్గరకు వచ్చిన విక్రాంత్ ను చూసి షాక్ అవుతాడు నాయక్. అసలు విక్రాంత్ కేవలం రాజకీయ నాయకులనే ఎందుకు టార్గెట్ చేశాడు..? అతనికి పొలిటికల్ లీడర్స్ మీద ఉన్న కసి ఏంటి..? ఫైనల్ గా విక్రాంత్ ఏం చేశాడన్నది సినిమా కథ.

నటీనటులు : సినిమాలో విక్రాంత్ పాత్రలో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గోపిచంద్. చాలా రోజుల తర్వాత గోపిచంద్ లో కామిక్ సెన్స్ చూసినట్టు అనిపిస్తుంది. డైలాగ్స్, ఫైట్స్ విషయంలో ఆయన గోపి సత్తా చాటాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కూడా బాగానే చేసింది. అయితే సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అని చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి, పృధ్విల కామెడీ ఆకట్టుకుంది. ఇక జయప్రకాశ్ రెడ్డి, షియాజి శిండే, తణికెళ్ల భరణి ఎప్పటిలానే తమ పాత్రలతో ఆకట్టుకోగా విలన్ గా సంపత్ మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.

విశ్లేషణ : మాస్, కామెడీ, ఫ్యామిలీ ఇలాంటి జానర్ లను కవర్ చేస్తూ గోపిచంద్ చేస్తున్న సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ మీద ప్రభావం చూపట్లేదు. అందుకే గోపిచంద్ మరోసారి తన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ పంతం చేశాడు. తన వరకు ఈ సినిమా బెస్ట్ అనిపించుకున్నాడని చెప్పొచ్చు. కథ మరి కొత్తగా అనిపించకపోయినా కథనం నడిపించిన తీరు బాగానే అనిపిస్తుంది. మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది.

ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే అదే విధంగా సెకండ్ హాఫ్ కొనసాగించలేదు. రెండో భాగం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. కథలో అనవసరమైన సన్నివేశాలు చేర్చి ఇంకాస్త సాగదీసినట్టు చేశాడు దర్శకుడు. ఎంచుకున్న కథను కమర్షియల్ పంథాలో చెప్పాలన్న ఆలోచనతో అలా చేసి ఉండొచ్చు. క్లైమాక్స్ కోర్ట్ సీన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడియెన్స్ ను అలరిస్తుంది.

బోట‌మ్ లైన్ :పంతం నెగ్గించుకున్న గోపిచంద్‌

https://www.youtube.com/watch?v=WSyger7d_NE

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -