టాలీవుడ్ ఫ్యామిలీలో పెళ్లిబాజాలు మొగుతున్నాయి. మంచి మహూర్తాలు ఉన్న ఈ సీజన్ లో వరసగా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మంచు ఫ్యామిలీలో పెళ్లి జరిగింది. హీరో మనోజ్ కుమార్ ఒక ఇంటివాడయ్యాడు. ఇప్పుడు ఈ సందడి వరుణ్ సందేశ్ ఇంటికి షిఫ్ట్ అయ్యింది. వరుణ్ సందేష్ చెల్లెలు వీణ సాహితి వివాహం జరిగింది.
‘అలా మొదలైంది’ సినిమాకు గీత రచయితగా చేసింది వీణ సాహితి. అన్నయ్య హీరో కాగా.. తను ఆ విధంగా తన క్రియేటివిటీని చాటుకొంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలకు వర్క్ చేసింది లేదు. ఇప్పుడు ఆమె వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. ఎన్ ఆర్ ఐ యువకుడు నితిన్ ను వివాహం చేసుకొందామె.
కొంతమంది సినీ ప్రముఖులు.. వరుణ్ కుటుంబీకుల మధ్య ఈ వివాహం జరిగింది. వరుణ్ తాతగారు జీడిగుంట రామచంద్రమూర్తి ప్రముఖ రచయిత, ఆలిండియా రేడియోలో పనిచేసిన వ్యక్తి. వరుణ్ చిన్నాన్న జీడిగుంట శ్రీధర్.. బ్యాంకు ఉద్యోగి అయిన శ్రీధర్ అనేక సినిమాల్లోనూ.. సీరియల్స్ లోనూ నటించాడు. శేఖర్ కమ్ముల తీసిన ‘హ్యాపీడేస్’ తో హీరోగా పరిచయమై వరుణ్ టాలీవుడ్ లో బండి లాగిస్తున్నాడు.
