Friday, April 26, 2024
- Advertisement -

లండన్ లో క్రికెట్ చూడనున్న చిన్నోడు, పెద్దోడు

- Advertisement -

దగ్గుబాటి మరియు ఘట్టమనేని కుటుంబాల మధ్య ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. వీరిద్దరిలో ఉండే కామెంట్ పాయింట్లలో ఒకటి క్రికెట్ పైన వారికి ఉన్న అభిమానం. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా వారిద్దరూ క్రికెట్ చూడటానికి ఇష్టపడతారు అని తెలిసిన విషయమే.

మరోవైపు ప్రపంచమంతటా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు మరియు వెంకటేష్ కలిసి లండన్ లో ఒక మ్యాచ్ చూడబోతున్నారు. జూన్ 9న లండన్ లో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఇండియా తరఫునుంచి మహేష్ బాబు మరియు వెంకటేష్ లండన్ కి వెళ్లబోతున్నారట. అక్కడే కొన్ని రోజులు గడిపి మళ్ళీ జూన్ మధ్య లో ఇద్దరు తిరిగి రానున్నారు. ఇండియా తిరిగి వచ్చాక వెంకటేష్ ‘వెంకీ మామా’ సినిమా షూటింగ్ తో బిజీ అవుతారు. మరోవైపు మహేష్ అనిల్ రావిపూడి ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -