Sunday, April 28, 2024
- Advertisement -

స్వరూపానందతో భేటీకి రేపు విశాఖకు జగన్..

- Advertisement -

ఇప్పుడు అంద‌రి చూపు జ‌గ‌న్ ఏర్పాటు చేయె కేబినేట్ కూర్పు పైనె. గ‌త నెల 30న జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస సమీక్ష‌ల‌తో బిజీగా ఉన్న జ‌గ‌న్ కేబినేట్‌పై దృష్టిసారించారు. ఇన్నాల్లు మౌనంగా ఉన్న జ‌గ‌న్ ఇప్పుడు కేబినేట్‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇప్ప‌టికే కేబినేట్‌పై జ‌గ‌న్ ఒక విష‌యానికి వ‌చ్చార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఐదురోజులు కావస్తున్నా ఇప్పటికీ మీడియాలో మినహా కేబినెట్ గురించిన చర్చ ఎక్కడా కనిపించడం లేదు.. అలాగని కేబినెట్ విస్తరణను జగన్ పక్కనబెట్టారా అంటే అదీ కాదు. ఈ నెల 8న కేబినెట్ విస్తరణకు తెరవెనుక చకచకా పావులు కదులుతున్నాయి. కేబినెట్ విస్తరణకు ముహుర్తం కోసం జగన్ రేపు విశాఖ శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందతో భేటీకి సిద్ధమవుతున్నారు.

స్వరూపానందస్వామీని సంప్ర‌దించ‌కుండా జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోర‌న్న సంగ‌తి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ కోసం వైఎస్ జగన్ సీఎం శ్రీ శారదా పీఠాధిపతి సలహాలను తీసుకొంటారని సమాచారం. ఎన్నికలకు ముందు శారదా పీఠాధిపతిని కలిసి జగన్ ఆశీస్సులు తీసుకొన్నారు.

కేబినేట్ ప‌దువుల కోసం నేత‌లు ఎవ‌రూ జ‌గ‌న్ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డంలేదు. మంత్రి పదవులపై తాను ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నానని, ఎవరూ తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని జగన్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే నేత‌లంద‌రూ ల‌క్‌ను న‌మ్ముకున్నారు. జ‌గ‌న్ ఒక సారి నిర్ణ‌యం తీసుకుంటె మార్చుకోర‌నె విష‌యం పార్టీ నేత‌ల‌కు బాగా తెలుసు. కేబినెట్ పై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన జగన్… విస్తరణ ముందురోజు మాత్రమే నేతలకు ఫోన్లు చేసి పిలిపించాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే వైఎస్సార్ సీఎల్పీ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై జగన్ సంకేతాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -