Monday, May 6, 2024
- Advertisement -

వెంకీ ప‌క్క‌న త‌మ‌న్నా.. ఎక్క‌డో కొడుతుందే..!

- Advertisement -

సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ గురు సినిమా త‌రువాత కొంత గ్యాప్ తీసుకుని వ‌ర‌స‌గా రెండు మ‌ల్టీ స్టార‌ర్ మూవీస్ చేస్తున్నాడు. అందులో ఒక‌టి త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ (వెంకీ మామ‌) సినిమా చేస్తున్నాడు. మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్2 సినిమాలో న‌టిస్తున్నాడు వెంకీ. ఇప్ప‌టికే ఎఫ్2 సినిమా ఫూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి అయింది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ సినిమాలో మెహ్రీన్,త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

వ‌రుణ్ తేజ్‌కు మెహ్రీన్, వెంక‌టేశ్‌కు త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ టైంలో తీసుకున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన ప్ర‌తి ఒక్క‌రికి ఒక డౌట్ వ‌స్తుంది. వ‌రుణ్ తేజ్‌-మెహ్రీన్ జంట ఒకేగాని వెంక‌టేశ్‌-త‌మ‌న్నా జంట చూడటానికి అంతాగా సెట్ అవ్వ‌లేద‌నే భావ‌న అంద‌రిలోను ఉంది. త‌మ‌న్నా తెలుగులో యంగ్ హీరోలంద‌రితోను న‌టించింది. ఆమె ఫ‌స్ట్ టైం వెంక‌టేశ్ లాంటి సీనియ‌ర్ హీరోతో న‌టిస్తుంది. పైగా వెంక‌టేశ్‌,త‌మ‌న్నాకు ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువుగా ఉండ‌టంతో,వీరి జంట పెద్ద‌గా వ‌ర్క్ అవుట్ కాద‌ని బావిస్తున్నారు.మ‌రి తెర మీద ఈ జంట ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -