Friday, May 17, 2024
- Advertisement -

బ్రేకింగ్ :హార్డ్‌డిస్క్‌లో ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత‌’

- Advertisement -

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌సినిమాపై సైబర్ నేరం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…వందల కోట్ల రూపాయలతో తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ మూవీస్‌కి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ హార్డ్ డిస్క్‌ల రూపంలో పోలీసులకు చిక్కడంతో షాక్‌తో ఉంది చిత్ర సీమ.తాజాగా హైదరాబాద్‌లో రాజేష్ అనే సినిమా ఎడిటర్‌ని అరెస్ట్ చేసి.. అతడి దగ్గరనుంచి ఒక హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ హార్డ్ డిస్క్‌‌లో ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో వున్న కొన్ని భారీ సినిమాలకు సంబంధించి రా ఫుటేజ్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద వీరరాఘవ’ సినిమాకు సంబంధించిన రా ఫుటేజ్‌ ఈ హార్డ్ డిస్క్‌లో ఉన్నట్టు సమచారం. ఆగష్టు 15 ఈ మూవీ టీజర్ విడుదల కానున్న నేపథ్యంలో టీజర్ విడుదలకు ముందే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈనెల 15న విడుదల కావాల్సిఉన్న ‘గీతా గోవిందం’తో పాటు ‘టాక్సీవాలా’ చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ఆ ఫుటేజ్ వేరే ఎవరికీ షేర్ చేయలేదని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. దీనిపై పూర్తి ద‌ర్యాప్తు చేయాల్సింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -