Saturday, May 4, 2024
- Advertisement -

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌తో మ‌ల్టీస్టార‌ర్‌

- Advertisement -

రాజా ది గ్రేట్ సినిమాతో ర‌వితేజ‌కు ఓ మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా త‌ర్వాత ఓ మల్టీస్టారర్ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా వెంకటేశ్ మెగా న‌టుడు వ‌రుణ్‌తేజ్‌తో క‌లిసి ఓ సినిమా తీద్దామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అయితే సీనియ‌ర్ న‌టుడు వెంక‌టేశ్ ఈ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపి ఓకే చేశారు.

అయితే రెండో హీరోగా ఎవరు నటిస్తారనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. ఫిదా సినిమాతో త‌న కెరీర్‌లోనే మంచి విజ‌యం అందుకున్న మెగా న‌టుడు వ‌రుణ్‌తేజ్‌. ఫిదా త‌ర్వాత మ‌ళ్లీ ఈ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు స‌మాచారం. అన్నీ ఒకే అయితే వెంక‌టేశ్‌, వ‌రుణ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

అనిల్ రావిపూడి తీసిన సినిమాల‌న్నీ హిట్‌గా నిల‌వ‌డంతో అత‌డితో సినిమాలు చేయ‌డానికి అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి F2 అనే టైటిల్ ఒకే చేసిన‌ట్లు స‌మాచారం. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ట్యాగ్ లైన్. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొన‌సాగుతున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -