Friday, April 26, 2024
- Advertisement -

వెంకటేష్,నయనతారలు జంటగా ‘బాబు బంగారం’

- Advertisement -

సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ జంటలు ఉంటాయి. ఒక్క సారి ఆ జంట హిట్ అయితే పదే పదే అదే కాంబినేషన్ ను చాలా సార్లు రిపీట్ చేస్తుంటారు నిర్మాతలు..దర్శకులు. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఓ హిట్ జంట మళ్లీ తెరపైన కన్పించబోతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’ లో వెంకటేష్,నయనతారలు జంటగా నటిస్తున్నారు. మారుతికి ఈ మధ్యే భలే భలే మగాడివోయ్ సినిమా సూపర్ హిట్ అందించిన సంగతి తెలిసిందే.

అదే జోష్ లో ఉన్న మారుతి  సినిమా ద్వారా మరో హిట్ అందుకోవాలని చూస్తున్నారు. మారుతి తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి మేకింగ్ తో పాటు రిలీజ్ విషయంలో కూడా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాంటి పోటీ లేకుండా జూన్ 1న సోలోగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -