Thursday, April 25, 2024
- Advertisement -

హీరోయిన్స్ ఫిక్స్ చేసుకున్న‌వెంకీ, వరుణ్

- Advertisement -

సీనియ‌ర్ హీరో వెంక‌టేష్, మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్‌కు హీరోయిన్‌గా మెహరీన్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే సీనియ‌ర్ హీరో అయిన వెంకీకి హీరోయిన్ వెత‌క‌డం పెద్ద స‌మస్య‌గా మారింది.వెంకీ ప‌క్క‌న కుర్ర హీరోయిన్లు చేయ‌నంటున్నారు.

ఇంకా సీనియ‌ర్ హీరోయిన్లు ఎక్కుడ డిమాండ్ చేయ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థ‌తిలో చిత్ర బృందం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని సంప్ర‌దిస్తే..వెంకీ ప‌క్క‌న హీరోయిన్‌గా ఒప్పుకుంది.దీంతో వెంకీ ప‌క్క‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా క‌నిపిస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.వచ్చే నెల నుంచి కంటిన్యూగా షూటింగ్ మీదకు వెళ్తే ఈ సినిమా మీద కాస్త ఆసక్తి వుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు వరుసగా హిట్ లు కొట్టడం, మల్టీ స్టారర్ కావడం, దిల్ రాజు నిర్మాత కావడం అన్నది కీలకం. అలాగే ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -