విక్టరీ వెంకటేశ్, యంగ్ హీరో నాగచైతన్య ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా వెంకీ మామ. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాలోని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పచ్చని వరిపొలం ,ఆ గట్టుపైన ధాన్యం మూటలు,వాటి చెంత చెట్టునే మగ్గిన అరటి గెలలు,కొబ్బరి చెట్టుసందులోంచి చూస్తే అల్లంత దూరాన కనిపిస్తున్న ఆ దేవాలయం, ఆ ధాన్యం మూటలపై కూచుని ఆ ఫోజిచ్చినిజన తీరు సూపర్‌గా ఉంది. ఈ సినిమాకు జైలవకుశ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నా డు. నిజ జీవితంతో మామ-అల్లుళ్లు అయిన నాగచైతన్య, విక్టరీ వెంకటేష్‌లు సినిమాలో కూడా మామ అల్లుళ్లుగా నటించడం విశేషం.
రాశీ ఖన్నా నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వెంకీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. మరి మామ అల్లుళ్లు తెర మీద ఎలాంటి సందడి చేస్తారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
- Advertisement -
ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన మామ -అల్లుళ్లు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -