టాలీవుడ్‌లో సంక్రాంతి హడావిడి మొదలైంది. సెలవలను క్యాష్ చేసుకునేందుకు సినిమాలు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలో ఎఫ్2. వెంకీ, వరుణ్ తేజ్‌లు నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశాడు అనిల్ రావిపూడి.
భార్య, భర్తల మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ని ఇందులో చూపించారు. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్ల పాత్రల్లో సందడి చేయబోతున్నారు. ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సంక్రాంతి హిట్ సినిమా ఇదే అనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లోనే హీరోయిన్స్‌గా నటించిన తమన్నా, మేహ్రీన్ హాట్ హాట్ అందాలను చూపించారు.వెంకటేష్, వరుణ్ తేజ్ లు తెలంగాణా యాస మాట్లాడుతూ మరింతగా ఆకట్టుకున్నారు. జనవరి 12న సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’