సల్మాన్- వెంకీ మూవీలో జగపతి బాబు

- Advertisement -

మల్టీ స్టారర్‌ మూవీలదే ఇప్పుడు హవా. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెకిస్తుండటంతో వివిధ భాషల స్టార్స్‌ ఒకే స్క్రీన్ పంచుకుని ప్రేక్షకులకు కనువిందు చేసే అవకాశం దొరుకుతోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాలీ. సల్మాన్‌కు జంటగా పూజా హెడ్గే నటిస్తోంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

వెంకీకి పూజా చెల్లలుగా కనిపించబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో విలన్‌గా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే సల్మాన్ సినిమాలో జగపతి బాబు చేయాల్సి ఉన్నా.. డేడ్స్ కుదరక చేయలేదు.

- Advertisement -

జూన్‌ నుంచి సెట్స్‌పైకి రాబోతున్న కభీ ఈద్ కభీ దివాలీ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే జరగనుంది. మరోవైపు సల్మాన్‌ ఖాన్ .. చిరంజీవి నటిస్తున్న గాఢ్ ఫాదర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

మహేశ్ బాబు సినిమాలో నాని

ఆ హీరోతో సమంత లిప్ లాక్ సీన్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -