Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ చిత్రం లో వేణు మాధవ్!

- Advertisement -

టాలీవుడ్‍లో మంచి కమెడియన్‌గా వేణు మాధవ్‍కి మంచి పేరు ఉంది. కొన్ని నేలలుగా వేణు కొన్ని కారణాల కారణంగా సినిమాల కు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయంపై కమెడియన్ వేణు మాధవ్ ని అడుగగా… అతను మాట్లాడుతూ నాకు సరిపడా క్యారెక్టర్స్ నాకు అందాకా పోవడం తో నేను వాటిని రిజెక్ట్ చేశాను.

మంచి కంటెంట్ తో ఉండే పాత్రను నేను ఒదులుకోను. అంతేకాకుండా, నేను క్యారెక్టర్ కోసం ఎవరి దగ్గరకు వెళ్లి అడుగను’ అని తెలిపాడు. చిరంజీవి నటించబోతున్న150 వ చిత్రం లో వేణు మాధవ్ నటించబోతున్నారు.

చిరు మూవీ తో పాటు బాలయ్య 100 వ చిత్రం, పవన్ కళ్యాణ్ -ఎస్.జే.సూర్య చిత్రం లో కూడా నటించబోతున్నాను అని వేణు మాధవ్ తెలిపాడు.ఈ చిత్రాల్లో నటించబోతున్నందుకు వేణు మాధవ్ చాలా హ్యాపీ గా ఉన్నారట.వేరే కమెడియన్స్ లా వేణు మాధవ్ కి తన కొడుకు లను సినిమా ఇండస్ట్రి లోకి ఎంటర్ చెయ్యడం ఇష్టం లేదట. మొత్తాన్నికి మళ్ళీ తెరపైకి వేణు మాధవ్ రావడం అందరిని సంతోష పెట్టే వార్త. మళ్లీ ఇదివరికిలాగే తన కామిడితో అందరిని నవ్విస్తూ అందరిని అలరిస్తాను అని అంటున్నాడు వేణు మాధవ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -