Monday, April 29, 2024
- Advertisement -

హీరో సూర్య పై కేసు నమోదు!

- Advertisement -

Tamilnadu, Suriya, Police, Case, స్టార్ హీరో, తమిళనాడు, ప్రేమ్ కుమార్, సూర్య

హీరో సూర్య పై కేసు నమోదుతమిళ స్టార్ హీరో సూర్య తమిళంలోనే కాకుండా తెలుగులోను మంచి క్రేజ్ సంపదించుకున్నాడు. ఇటివలే 24 అనే సినిమాతో మంచి హిట్‍ని తన ఖాతలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరో పై కేసు నమోదు అయింది. ఎందుకు అనుకుంటున్నారా..? తమిళనాడు లోని జె 5 శాస్త్రి నగర్ పొలీస్ స్టేషన్ లో సూర్య పై కేసు నమోదు అయ్యింది.

సూర్య లెనిన్ ఇమాన్యు యెల్ పై చేయి చేసుకున్నాడని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదు అయ్యింది . సంఘటన వివరాలలోకి వెళితే… లెనిన్ ఇమాన్యుయెల్ (25) తన స్నేహితుడైన ప్రేమ్ కుమార్ (21) తో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు బైక్ పై వెళుతున్న సమయంలో ఆధ్యార్ ప్రాంతం లో సడెన్ గా ఓ కారు వచ్చి బైక్ ని డాష్ ఇవ్వడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.

బైక్ కొంత భాగం దెబ్బతింది దాంతో డబ్బులు ఇవ్వమని అడుగుతున్న సమయంలో హీరో సూర్య వచ్చి అనవసరంగా చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే సూర్య మేనేజర్ కథనం మరోలా ఉంది, రోడ్డు పై ట్రాఫిక్ నిలిచిపోతోంది పైగా లేడి ని పట్టుకొని వేధించడం తప్పు అని సర్దిచేప్పాడని అంటున్నాడు. మరి పోలిసులు దర్యాప్తు చేసి ఏమని తెలుస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -