Friday, May 3, 2024
- Advertisement -

నాగ్‌-వ‌ర్మ ‘ఆఫీస‌ర్’ :మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల రికార్డు

- Advertisement -

28 ఏళ్ల త‌రువాత వ‌స్తున్న కాంబినేష‌న్ కావ‌డంతో అంద‌రు ఎంతగానో ఎదురు చూస్తార‌ని అనుకున్నారు.కాని వారి ఆశ నిరాశే అయింది.28 ఏళ్ల క్రితం నాగ‌ర్జున -వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శివ ఎంత‌టి రికార్డులు సృష్టించిందో మ‌నంద‌రికి తెలిసిందే.ఇప్పుటికి ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి.

ఈ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అయ్యాడు రాంగోపాల్ వ‌ర్మ‌.అయితే ఇన్ని సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ వీళ్ల‌ద్ద‌రి క‌లిసి ఆఫీస‌ర్ సినిమా చేశారు.అయితే ఈ సినిమా ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ల‌లో రికార్డు సృష్ఠించింది.ఫీసర్ మొదటి రోజు కలెక్షన్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు.ఆఫీసర్ సినిమాకి మొదటి రోజు పట్టుమని 45లక్షల రూపాయల షేర్ కూడా రాలేదు .

నాగార్జునకు మంచి పట్టుందని చెప్పుకునే ఈస్ట్, వెస్ట్, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి కేవలం నాలుగేసి లక్షల రూపాయలు మాత్రమే వసూళ్లు వచ్చాయి. ఇక అత్యల్పంగా నెల్లూరు నుంచి రెండున్నర లక్షల రూపాయలొచ్చాయి. మొద‌టి రోజే సినిమా ప‌రిస్థితి ఇలా ఉంటే త‌రువాత రోజుల‌లో సినిమా ఏమౌతుందో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -