Thursday, May 2, 2024
- Advertisement -

పెట్టుబ‌డిలో స‌గం రాబ‌ట్టిన మహానటి!

- Advertisement -

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను మ‌హ‌న‌టి సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించింది.సినిమా విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది.మ‌హ‌న‌టిలో కీర్తి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.అదేవిధాంగా సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.సినిమా ఇండియాలో ఎలా క‌లెక్ట్ చేసిందో యూఎస్‌లో కూడా క‌లెక్ష‌న్స్ అదేవిధాంగా ఉన్నాయి.ఓవ‌రాల్‌గా యూఎస్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన తెలుగు సినిమాల‌లో 6వ స్థానంలో నిలిచింది.

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా ద‌క్కించుకుంది.డిజిటల్ హక్కులు అమెజాన్ కు దక్కాయి.. తెలుగు, తమిళ్, మళయాలం అన్నీ కలిపి మొత్తంగా 15కోట్లు నిర్మాతలకు దక్కాయి.సినిమాకు పెట్టిన పెట్టుబ‌డి స‌గం శాటిలైట్ రైట్స్ రూపంలో రావ‌డంతో నిర్మాత‌లు హ్యాపీగా ఉన్నారు.ఇంకా మహ‌న‌టి సినిమా కొన్ని థియోట‌ర్ల‌లో స్ట‌డీగా ర‌న్ అవుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -