Friday, March 29, 2024
- Advertisement -

అల్లుడిని రక్షించుకునే పనిలో విక్టరీ వెంకటేష్..!

- Advertisement -

ఇప్పటి వరకూ చాలా మంది హీరోలతో కలిసి నటించాడు విక్టరీ వెంకటేష్. తన వయసు వారితోనూ.. తన కన్నా చిన్నవయసు వారితోనూ వెంకీ కలిసి నటించాడు.

ఇగోలు పక్కనపెట్టి మల్టీ స్టారర్ సినిమాలు రావడానికి కారణం అయ్యాడు వెంకీ. అసలు వెంకటేష్ చొరవతోనే చాలా మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కయాని వెరే చెప్పనక్కర్లేదు. మరి ఇలాంటి నేపథ్యం ఉన్న వెంకీ మరో మల్టీ స్టారర్ సినిమాకు పచ్చజెండా ఊపాడు. ఈ సారి తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు వెంకీ! 

నాగచైతన్య హీరోగా మలయాళ సినిమా ‘ప్రేమమ్’ రీమేక్ అవుతున్నవిషయం తెలిసిందే. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు నాగచైతన్య అండ్ గ్యాంగ్. ఇలాంటి నేపథ్యంలో మలయాళం వెర్షన్ లో అనంత నాగ్ చేసిన పాత్రను తెలుగులో వెంకీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా మేనల్లుడి సినిమాకు మల్టీ స్టారర్ లుక్ తీసుకురావడానికి వెంకీ ప్రయత్నిస్తున్నాడు. ప్రేమమ్ సినిమా తెలుగు వెర్షన్ కు ‘మజ్ను’  అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. 

ఇది వరకూ నాగార్జున హీరోగా ‘మజ్నూ’ ఒక సూపర్ హిట్ గా ఉంది. ఇప్పుడు తండ్రి టైటిల్ నే నాగచైతన్య వాడుకొంటున్నాడు. ఆ సినిమాలో నటిస్తూ మామయ్య సహాయం చేస్తున్నాడు. మరి ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -