Thursday, May 30, 2024
- Advertisement -

అమరావతిలో చంద్రబాబుదే అతిపెద్ద విగ్రహం…!

- Advertisement -

స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ స్థాయిలో ఉంటుందట తెలుగుదేశం అధినేత చంద్రబాబు విగ్రహం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో బాబుకు ఒక గుడి కట్టనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

బాబు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకుగానూ … ఈ గుడిని నిర్మిస్తున్నారని అంటున్నారు. బహుశా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఈ పని పెట్టుకొంటూ ఉండాలి. అయినా బతికున్న వాళ్లకు గుడి కట్టడం అనేది హైందవ సంప్రదాయం కాదు. చనిపోయిన వాళ్లకు అయితే దేవాలయాలు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది.

అయితే తమిళనాడు వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ హీరోయిన్లకు గుళ్లు గోపురాలు కట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే అది వేరే లెక్క. రాజకీయ నేతలు ఇలా గుళ్లు కట్టించుకోవడం విడ్డూరమే. ఆ మధ్య సోనియాగాంధీకి గుడకడతాను అంటూ శంకర్రావు బయలుదేరాడు. అయితే ఆ గుడి నిర్మాణం ఇప్పుడు ఎంత వరకూ వచ్చిందో తెలియదు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా చంద్రబాబు గుడి, విగ్రహం అంటున్నారు. అది కూడా స్టాట్చ్యూ ఆప్ లిబర్టీ స్థాయిలో ఉంటుందట విగ్రహం.

మరి ఇదే నిర్మాణం జరిగితే.. ఏపీ రాజధాని అమరావతిలో ఎటు చూసినా చంద్రబాబే కనిపిస్తాడని అనుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అక్కడ నిర్మిస్తామని ఇది వరకే తెలుగుదేశం వారు ప్రకటించారు. ఓవరాల్ గా ఎన్టీఆర్ విగ్రహం, చంద్రబాబు విగ్రహాలే  హైలెట్ అవుతాయేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -