Thursday, May 16, 2024
- Advertisement -

సోనియా, రాహుల్ లు పర్మిషన్ ఇస్తే.. విద్యాబాలన్ సినిమా రెడీ!

- Advertisement -

‘డర్టీ పిక్చర్’ తో విద్యాబాలన్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకొంది. దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ సినిమా తర్వాత విద్యాకు అలాంటి అవకాశాలు అనేకం వస్తున్నాయి.

ఈ పరంపరలో విద్యాబాలన్ ను పెట్టి దివంగత ప్రధానమంత్రి ఇందిరగాంధీ జీవిత కథను సినిమాగా తెరకెక్కించడానికి బాలీవుడ్ లోని ఔత్సాహిక దర్శక, నిర్మాతలు ఉత్సాహంతో ఉన్నారు.

విద్యాబాలన్ కూడా ఆ రోల్ ను చేయడానికి చాలా ఉత్సాహంతో ఉంది. ఇందిర రోల్ ను చేయడం అంటే అంతకన్నా గౌరవం ఏముంది? అంది దేశ వ్యాప్తంగా సంచలన సినిమా అవుతుంది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేతిలోనే దారుణంగా హతమైన ఇందిర పట్ల ఇప్పటికీ గొప్ప గౌరవభావం ఉంది. ఆమె ధైర్యసాహసాలకు ఈ తరం కూడా సలాం చేస్తుంది. 

మరి అలాంటి ఇందిర జీవిత కథ సినిమాగా వస్తే అందరినీ ఆకట్టుకొంటుంది కూడా. మరి ఈ సినిమా ను చేయడానికి దర్శక, నిర్మాత, విద్యాబాలన్ లు సిద్ధం. అయితే ఈ సినిమా రావాలంటే.. దానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇందిరకు ఇప్పుడు వారసులు వారే కాబట్టి.. ఈ సినిమాకు వారి సమ్మతం అవసరమని సినిమా వాళ్లు భావిస్తున్నారు. అయితే వారి అనుమతి లేకుండా కూడా సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -