Sunday, May 19, 2024
- Advertisement -

నా శ‌రీరంపై మీకు ఎందుకు అంత ఆశ‌క్తి?

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్‌గా ఉండాలంటే మంచి ఫిజిక్ మెయినెంట‌న్ చేయాలి.అలా ఉంట‌నే అక్క‌డ ప్రేక్షకుల‌లో కుడా ఆద‌ర‌ణ ఉంటుంది అని అక్క‌డ అవిధాంగా ఫిక్స్ అయ్యారు. కాని ఒక్క విద్యాబాల‌న్ విష‌యంలో త‌ప్ప. ఆమె కాస్త బొద్దుగా హీరోయిన్గా రాణించి చూపించారు.బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి విద్యాబాల‌న్‌ వ‌స్త్ర‌ధార‌ణ గురించి, ఆమె శ‌రీరం గురించి ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి.

ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో ఆమె వ‌స్త్ర‌ధార‌ణ గురించి షారూక్ బ‌హిరంగంగానే వ్యంగ్యంగా మాట్లాడాడు. అలాగే ఆమె చాలా లావుగా ఉంటుందని, స‌గ‌టు బాలీవుడ్ హీరోయిన్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఆమెకు లేవ‌ని విమ‌ర్శ‌కులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.తాజాగా అలాంటి విమ‌ర్శ‌ల‌పై విద్య స్పందించింది. `బాడీ షేమింగ్ గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. నాకిలాగే కంఫ‌ర్ట్‌గా ఉంది. నా శ‌రీర‌తత్వ‌మే అంత‌. నేను స‌న్నగా ఉండ‌లేను. కాస్త బొద్దుగా క‌నిపిస్తే చాలు.. ప్రెగ్నెంట్ అంటూ వార్త‌లు రాసేస్తున్నారు. అలాంటి వార్త‌లు ఎంత బాధ క‌లిగిస్తాయో ఆలోచించండి. సినిమాలో నా అభిన‌యం బాగా లేక‌పోతే విమ‌ర్శించండి. సోష‌ల్ మీడియాలో నా శ‌రీరం గురించి ఎన్నో అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు. అయినా నేనిలాగే ఉంటాను. లావుగా ఉండ‌డం నేర‌మేమీ కాదు. స‌న్న‌గా మ‌రే ప్ర‌శ్నే లేద‌`ని విద్య తేల్చిచెప్పింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -