Thursday, May 16, 2024
- Advertisement -

అతగాడికి టాలీవుడ్ యావ చావలేదు

- Advertisement -

బిచ్చగాడిచ్చిన ఎనర్జీతో విజయ్ ఆంటోని టాలీవుడ్ పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. దానిలో భాగంగానే వన్ బై వన్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ట్రైలర్ తో అదరగొట్టిన అన్నాదురై చిత్రంపై కూడా మనోడు గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ తమిళ తంబీ వరుస చూస్తుంటే అబ్బాయిగారికి టాలీవుడ్ ఫీవర్ పట్టుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.

బిచ్చగాడు మాదిరిగా బేతాళుడు, యమన్ లేమైనా అధ్బుతాలు సృష్టిస్తాయనుకుంటే అవి కూడా అంతగా రాణించిన పాపాన పోలేదు. వీటిలో ఏ సినిమాకు మంచి ఆదరణ వచ్చినా… విజయ్ మార్కెట్ టాలీవుడ్లో మరోలా ఉండేది. కాని అలాంటి సీన్ కనిపించలేదు. బట్ ఇప్పటికీ విజయ్ ఆంటోని విషయంలో బయ్యర్లకు ఓ పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంది.

కేవలం కోలీవుడ్ సినిమాలు చేస్తేనే తన ర్యాంక్ పెరగదని తెలుసుకున్న విజయ్ ఆంటోని..టాలీవుడ్లోను కంటెంట్ వర్కవుట్ అయితే.. అటు రెమ్యునిరేషన్ ఇటు ర్యాంక్ పెంచుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నాడు. కార్తి,విక్రమ్ ,సూర్యలైనా టాలీవుడ్లో మార్కెట్ లేకపోతే కామ్ గా కూర్చుంటారేమో గాని..విజయ్ కూర్చునేలా లేడని రీసెంట్ గా ఓ నిర్మాత గా చెబుతున్నాడంటే విషయంలో ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకుంది.దీనికి తోడు తాజాగా ఈ హీరోగారు అన్నాదురైగా తమిళంలోను.. తెలుగులో ఇంద్రసేనగా రాబోతున్నారు. మరి ఈ ఫిలిం అయినా వర్కవుట్ అయితే అయ్యగారి టాలీవుడ్ యావ తీరుతుంది.ఇది కూడా గట్టెక్కకపోతే.. కామ్ అయిపోతూ కార్తి మాదిరిగా లైట్ తీసుకోవడం బెటర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -