Tuesday, May 14, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న “బిచ్చగాడు 2” థీమ్ సాంగ్

- Advertisement -

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది.

తాజాగా బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా సాగిన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ఆసక్తిరేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -