Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ చిత్రానికి 1 మిలియన్ ఇంట్రెస్ట్స్

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరెకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్‌ఆర్. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ చూసేందుకు ఇక ఎంత మాత్రం వెయిట్ చేసేది లేదన్నట్లుగా ఉన్నారు ప్రేక్షకులు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మూవీ టికెట్స్ ఆన్‌లైన్లో విక్రయించే యాప్ బుక్‌మై షోలో ఇప్పటికే ఈ చిత్రం చూసేందుకు మిలియన్ పైగా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించేశారు. ఆర్ఆర్ఆర్‌ మూవీ క్రేజ్ ఏ రేంజ్‌ లో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న శాంపిల్ మాత్రమే.

మరోవైపు భారీగా ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేశారు ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్ 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఈవెంట్‌తో ముగియనున్నాయి. 18వ తేదీన హైదరాబాద్‌ నుంచి ప్రారంభమై ఈ సంబరాలు దుబయ్ చేరుకోనున్నాయి. అక్కడ్నుంచి యూనిట్ 19న బెంగళూరు చేరుకోనున్నారు. బెంగళూరులో జరిగే ఈవెంటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -