- Advertisement -

విజయ్ బర్త్ డే..రష్మిక సందడి?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ 37వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే అభిమానులు కేక్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో సందడి చేశారు. అభిమానుల ప్రేమకు స్పందించిన విజయ్ ఇంటి బయటకు వచ్చి వారికి అభివాదం చేస్తూ చేతులు ఊపారు.

విజయ్ దేవరకొండను చూసేందుకు వచ్చిన అభిమానులు “హ్యాపీ బర్త్‌డే రౌడీ” అంటూ నినాదాలు చేశారు. కొందరు అభిమానులతో విజయ్ సెల్ఫీలు దిగగా, మరికొందరికి ప్రత్యేకంగా అభివాదం చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుట్టినరోజు వేడుకల్లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొనగా విజయ్ నివాసం వద్ద రష్మిక కనిపించిందంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఇద్దరి తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

జూబ్లీహిల్స్‌లో ఉన్న విజయ్ దేవరకొండ నివాసం విలాసవంతమైన నిర్మాణ శైలితో ప్రత్యేక గుర్తింపు పొందింది. సుమారు రూ.15 కోట్ల విలువ చేసే ఈ బంగ్లాలో ఆధునిక ఇంటీరియర్స్‌, విశాలమైన ఓపెన్ స్పేస్‌, ఫ్యామిలీ లౌంజ్‌, ప్రత్యేక గార్డెన్ ఏరియా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పుట్టినరోజు సందర్భంగా విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం రౌడీ జనార్థన నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -