- Advertisement -

16న పెద్ది ఈవెంట్..ఎక్కడో తెలుసా?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మే 16న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

పెద్ది పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండటంతో ఉత్తర భారత ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ లేదా చెన్నై కాకుండా భోపాల్‌లో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేసినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ పవర్‌ఫుల్ గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు మాస్ యాక్షన్ అంశాలు కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల మూవీ ఫైనల్ ఎడిట్ కూడా పూర్తైనట్లు మేకర్స్ ప్రకటించడంతో ప్రమోషన్స్ వేగం పెరిగింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న “పెద్ది” చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -