Sunday, May 19, 2024
- Advertisement -

విజయ్.. కేసీఆర్ కి ఎలా బంధువు అయ్యాడంటే..?

- Advertisement -

అర్జున్ రెడ్డి.. ప్రస్తుతం యూత్ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండను తెలంగాణ సూపర్ స్టార్ అని వర్మ లాంటి వాళ్లు అంటున్నారు.

ఇక కొందరు అయితే.. కులాభిమానం ఉన్నవాళ్లు.. విజయ్ కి క్యాస్ట్ ట్యాగ్ కూడా తగిలించేశారు. టాలీవుడ్లోకి వెలమ సూపర్ స్టార్ వచ్చాడంటూ విజయ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలంగాణ సీఎం.. కేసీఆర్ కూడా వెలమ కులస్థుడే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కేసీఆర్ కు, విజయ్ దేవరకొండకు చుట్టరికం ఉందన్న ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం ఇదే మాట అన్నారు. సో విజయ్ దేవరకొండ కేసీఆర్ కు బంధువని.. అందుకే ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సహకారం అందించారని.. ఆరోపించారు వీహెచ్. దీనికి విజయ్ కౌంటర్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కేసీఆర్ కుటుంబంతో దూరపు చుట్టరికం ఉన్న విషయం నిజమే అన్నాడు. చిన్న కమ్యూనిటీ కావడం వల్ల ఎక్కడో ఒక చోట చుట్టరికం కలవడంలో ఆశ్చర్యమేమీ లేదని అతను చెప్పాడు. అయితే కేసీఆర్ ఫ్యామిలీతో తన ఫ్యామిలీకి ఎలాంటి సంబంధాలు లేవని.. తాను కేసీఆర్ ను ఎప్పుడూ కలవలేదని అతను స్పష్టం చేశాడు. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన విజయ్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -