Saturday, May 18, 2024
- Advertisement -

పైసా వసూల్ స్టోరీ లీక్.. నెట్ లో హల్ చల్

- Advertisement -

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పటివరకు.. స్టార్ హీరోలతో.. చాలా సినిమాలు చేశారు. కానీ పూరి అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా పోకిరి. ఈ సినిమా పూరి కెరీర్ ను మార్చేసింది. అంతేకాకుండా.. హీరో మహేష్ బాబుకి కూడా ఉహీంచని రెంజ్ హిట్ ఇచ్చింది. పోకిరిలో.. అప్పటిదాకా అల్లరి చిల్లరగా క్రిమినల్ గా తిరిగిన మహేష్ ఒక్కసారిగా పోలీస్ అని తెలిసే సరికి ప్రేక్షకుల మతులు పోయాయి.

ఈ సినిమా ప్రేరణతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరిజగన్నాథ్ మాత్రం మళ్లీ పోకిరీ లాంటి సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ఇక బాలయ్య తో తీసిన పైసా వసూల్.. టీజర్, ట్రైలర్ చాలా కొత్తగా ఉన్నాయి. పూరి జగన్నాథ్ మార్క్ డైలాగులు బాలకృష్ణ నోటినుంచి వింటుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలగడం ఖాయం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చాలా సింపుల్, ఓ రకంగా చెప్పాలంటే పోకిరిని రివర్స్ చేస్తే అదే పైసా వసూల్.

పోకిరిలో.. మహేష్ బాబు.. క్రిమినల్ గా ఉంటూ.. అన్ని కనిపెడుతూ.. చివర్లో తానొక పోలీస్ అని ఇంతకాలం ఒక ఆపరేషన్ లో ఉన్నాడని రీవీల్ అవుతుంది. పైసా వసూల్ సినిమా లో హీరో ఒక పోలీసులా నటిస్తాడట. అయితే నిజానికి అతనొక మాఫియా డాన్ అట‌. ఇదే ట్విస్ట్.. క్లైమాక్స్ కి వచ్చే సరికి తెలుస్తోందట. మరి ఈ సినిమా కథ నిజమో.. కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం కథ ఇదే అని ప్రచారం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -