యాంకర్ అనసూయ.. తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. యాంకరింగ్ తో పాటు.. సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్.. కొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రను పోషించింది. మరో రెండు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈమెకు ఏకంగా 3 లక్షలకుపై మంది వార్నింగ్ ఇచ్చారు.
అది కూడా “అర్జున్ రెడ్డి” సినిమా వ్యవహారంలో.. అనసూయ స్పందిచిన తీరుపైనే. అర్జున్ రెడ్డి లాంటి సినిమా యువకులపై ప్రభావం చూపేలా ఉంది.. ఇలాంటి సినిమాలు రావద్దు అని అనసూయ కామెంట్స్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. అనసూయ చేసిన ట్వీట్‌కు 3 లక్షల మందికిపైగా అభిమానులు మెసేజ్ లు చేశారట. ముందు నువ్వు సరిగ్గా బట్టలు వేసుకో. నీతులు చెప్పే ముందు.. నువ్వు ఎంతవరకు కరెక్ట్ గాఉన్నావో చూసుకో.. ‘జబర్దస్త్’ షోలో పొట్టి పొట్టి బట్టలు వేసుకోని డాన్స్ లు వేస్తే తప్పు లేదు.. ఓ ప్రోగ్రాంలో షేకింగ్ శేషుతో మాట్లాడకుడని మాటలు మాట్లాడితే తప్పు లేదా.. అవన్ని మరిచిపోయావా.. అంటూ అనసూయని తిడుతున్నారు.
అంతేకాకుండా.. ఇటివలే.. పవన్ పై కామెంట్స్ చేసిన కత్తి మహేష్ కి పవన్ ఫ్యాన్స్ ఏ రెంజ్ లో ఫోన్స్ చేసి చుక్కలు చూపిస్తున్నారో అదే రెంజ్ లో అనసూయకి ఫోన్స్ చేసి చుక్కలు చూపిస్తున్నారట. దాంతో అనసూయకు ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉందట.