Saturday, May 4, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ మారక తప్పదు

- Advertisement -

డియర్ కామ్రేడ్ సినిమా తో విజయ్ దేవరకొండ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మీద ఉన్న హైప్ కి, సినిమా ని ప్రమోట్ చేసిన తీరు కి, సినిమా విడుదల అయ్యాక వస్తున్న టాక్ కి అస్సలు ఎటువంటి సంబంధం లేదు. సినిమా ఆశించిన స్థాయి లో ఆడటం లేదు అని అటు విజయ్ కి, సినిమా తీసిన దర్శకుడికి, నిర్మించిన నిర్మాతలకి విడుదల రోజున మొదటి ఆటకే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ నేపథ్యం లో విజయ్ ఈ సినిమా తో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం హీరో కారెక్టర్.

అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా అలాగే ఉంది. గీత గోవిందం, నోటా చేసినా ఏ మాత్రం అలాంటి పాత్ర వచ్చినా విజయ్ ని అంగీకరించలేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకే విజయ్ ఈ సారి పెద్ద మార్పు తో రాక తప్పదు. మరో రెండు మూడేళ్ళ పాత్రలు చేయకుండా ఉంటె చాలా మంచిది.

అంతే కాకుండా ఈ సినిమా డైరెక్షన్ విషయం లో కూడా విజయ్ ఇన్వాల్వ్ అయ్యాడు అనే వార్తలు కూడా ఇండస్ట్రీ లో వచ్చాయి. అదే నిజం అయితే అది కూడా విజయ్ తగ్గించుకుంటే మంచిది. లేదంటే విజయ్ అంతకంతకూ విజయానికి దూరం అయ్యే పరిస్థితి రావొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -