Saturday, May 4, 2024
- Advertisement -

డియర్ కామ్రేడ్ పై వెనకడుగు వేయనున్న కరణ్ జోహార్?

- Advertisement -

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమా ని ప్రపంచ మొత్తం కన్నా ముందు చూసిన వ్యక్తి బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్. సినిమా చూసిన వెంటనే సినిమా మీద ఒక పెద్ద పాజిటివ్ రివ్యూ రాసి, సినిమా ని హిందీ లో రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ ప్రకటన వచ్చినప్పుడు అది ఒక సెన్సేషనల్ వార్త అయిపొయింది.

కట్ చేస్తే సినిమా నాలుగు భాషల్లో విడుదల అయ్యింది. ఒక్క భాషలో కూడా సినిమా ఆశించిన స్థాయి లో ఆడలేదు. దీని వలన సినిమా కి మంచి పేరు రాలేదు. విజయ్ కూడా విమర్శల పాలయ్యాడు. ఇంకా కొంత మంది అయితే ఈ సినిమా అసలు కరణ్ కి ఎలా నచ్చింది అని విమర్శలు కూడా చేశారు. ఇవన్నీ ఆ నోటా ఈ నోటా పాకి కరణ్ చెవిని చేరాయి.

అయితే కరణ్ జోహార్ కి ఈ సినిమా పొటెన్షియల్ అర్ధం అయిపోయిందట. ఈ సినిమా ఆడే అవకాశం లేదని తీర్మానించుకున్నాడట. అందుకనే ఈ సినిమా ని రీమేక్ చేయాలి అనే ఆలోచన ని విరమించుకుంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రీమేక్ చేస్తే విజయ్ తో నే చేయాలని, లేదంటే సినిమా ని పక్కన పెట్టేయాలి అని కరణ్ భావిస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -