విజయ్ దేవరకొండ.. ఈ పేరు వినగానే అర్జున్ రెడ్డి సినిమా తప్పక గుర్తొస్తుంది.. కొన్ని సంవత్సరాలకు గానీ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు రావు , హీరోలు రారు.. అలా ట్రెండ్ సెట్ చేసిన హీరో, సినిమా రెండు ఒకేసారి టాలీవుడ్ కి దొరికారు..ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఆ సినిమా కంటెంట్ అని చెప్పాలి.. ఆ కంటెంట్ కంటే విజయ్ చేసిన యాక్టింగ్ అని చెప్పాలి.. రెండు సమపాళ్లలో ఒకరితో ఒకరు పోటీ పడేలా ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుది.. కొంత వల్గారిటీ ఎక్కువ అయ్యింది అనిపిస్తుంది కానీ ఇప్పటి జెనరేషన్ కి అది చాలా తక్కువ..
ఈ సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో గా సెటిల్ అవగా, దర్శకుడు కూడా పెద్ద పెద్ద సినిమాలతో బిజీ గా మారిపోయాడు.. విజయ్ ఇప్పటివరకు అన్ని సినిమాలు చేసినా అర్జున్ రెడ్డి ప్రభావం ఆయనమీద ఇంకా పోలేదని చెప్పాలి.. హిందీలో ఆ సినిమా తీస్తే అక్కడ నటించిన హీరో కంటే విజయ్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. అందుకే ఇప్పుడు అయన చేస్తున్న సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోల బెర్త్ కి ఎసరుపెడుతున్నాడు.. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో చేస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా.. అందుకే కరణ్ జోహార్ ను ఈ సినిమా కి భాగస్వామి చేయగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ను హీరోయిన్ గా తీసుకున్నారు..
ఇక విజయ్ దేవరకొండ నిజంగా సౌత్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అని మరోసారి రుజువు అయ్యింది.. సౌత్ లో ఏ ఒక్క హీరోకు లేని ఫాలోవర్స్ సంఖ్యను విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఏకంగా 9 మిలియన్ ల ఫాలోవర్స్ ను క్రాస్ చేశాడు. మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోలు సైతం 6 మిలియన్ ల ఫాలోవర్స్ ను సంపాదించలేక పోయారు. అలాంటిది విజయ్ దేవరకొండ ఏకంగా 10 మిలియన్ లకు చేరువ అవ్వడం ఆయన క్రేజ్ కు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ అభిమానులు అంటున్నారు. ఏదేమైనా తక్కువకాలంలో విజయ్ ఈ ఫీట్ ని సాధించడం మంచి అఛీవ్మెంట్ అని చెప్పాలి..