Tuesday, April 30, 2024
- Advertisement -

ఓటీటీలోకి విజయ్ ఫ్యామిలీ స్టార్!

- Advertisement -

పరుశరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ సినిమా రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ అమెజాన్ సొంతం చేసుకోగా మే 3 నుంచి తెలుగుతో తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుందట. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుంది.

బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూలు అందుకోగా దీనిపై దిల్ రాజు కూడా తనదైన శైలీలో స్పందించిన సంగతి తెలిసిందే. కొంతమంది కావాలనే తమ సినిమాపై నెగటివ్‌ టాక్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక నెగటివ్ టాక్‌తో సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -