Monday, May 13, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ తప్పుగా మాట్లాడాడేమో..!

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌రకొండ త‌న యాటిట్యూడ్ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టించిన టాక్సీవాలా సినిమా మంచి విజ‌యం సాధించింది.అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ఈ సినిమా హెచ్‌డి ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయింది.దీంతో సినిమా విడుద‌ల అవుతుందా లేదా అని చాలామంది అనుమానించారు.మొత్త‌నికి సినిమా విడుద‌లై హిట్ అయింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతు సినిమా పైరసీ చేసిన వారికి మిడిల్ ఫింగ‌ర్ చూపించి మాట్లాడాడు.ఇక నిన్న‌(శుక్ర‌వారం) టాక్సీవాలా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.ఈ స‌క్సెస్ మీట్‌లో విజ‌య్ కాస్తా ఓవ‌ర్‌గానే మాట్లాడ‌ని అనుకుంటున్నారు.

సినిమా పైరసీ చేసే వాళ్ల‌కు స‌వాల్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ద‌మ్ముంటే త‌న త‌రువాత సినిమా పైర‌సీ చేయ‌మ‌ని స‌వాల్ చేశాడు.విజ‌య్ అలా మాట్లాడ‌కుండా ఉండాల్సింది అని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.సినిమా పైర‌సీ కాకుండా చాలామంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లం అయ్యారు.. అసలు ఎవరు ఎక్కడ నుండి ఎలా పైరసీ చేస్తున్నారో తెలుసుకోలేక ఈ విషయంలో పోలీసులు సైతం చేతులెత్తేశారు. మ‌రి ఇటువంటి ప‌రిస్థితుల‌లో విజ‌య్ ఇలా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో తెలుసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -