Friday, April 26, 2024
- Advertisement -

‘లైగర్’ ఫస్ట్ లుక్ రెస్పాన్స్ పై విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ లో నటించిన చిత్రాలు కొన్నే అయినా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఇక గీతాగోవిందం చిత్రంతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా మంచి హిట్ టాక్ వచ్చాయి. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడ్డాయి.. దాంతో ఆలస్యం అయ్యింది.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం టైటిల్ ను నిన్ననే ఆవిష్కరించారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్రబృందం పంచుకుంది.  తాజాగా పబ్లిక్ లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి వస్తున్న ఆదరణ చూసి విజయ్ దేవరకొండ స్పందించారు. సలు, థియేటర్లకు జనాలు వస్తారా? అని భావించానని, కానీ అభిమానుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని విజయ్ ట్వీట్ చేశాడు.

నా ప్రియమైన అభిమానులారా…. నిన్న మీరు నన్ను ఎంతో సంతోషకరమైన భావోద్వేగాల్లో ముంచెత్తారు. ‘లైగర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాక సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు నన్ను కదలించివేశాయి అంటూ ట్విట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -